గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్‌…ఇక జీతాలు కట్‌ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక మార్పులు చేయడం జరిగింది. ఇవాల్టి నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్ లో సచివాలయానికి వచ్చిన సమయం అలాగే వెళ్ళిన సమయాన్ని రెండిటిని… నమోదు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

big shock to Village Ward Secretariat Employees

ఈ మేరకు… గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామని… ఉద్యోగులందరికీ.. మెసేజ్లు పంపారు ఉన్నతాధికారులు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు… పరిస్థితి ఇలా ఉండేది కాదు. కార్యాలయానికి వచ్చిన సమయం లేదా… ఇంటికి వెళ్లే సమయంలో ఏదో ఒకసారి… హాజరు వేసుకుంటే సరిపోయేది. అప్పుడు ఫుల్ జీతం పడేది. కానీ ఇప్పుడు రెండు సమయాల్లో కూడా… హాజరు వేసుకోవాలని ఆదేశించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీంతో గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు… ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news