పల్నాడు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఓ టిప్పర్. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. ఢీకొట్టాక మంటలు చెలరేగడంతో.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. అయితే పల్నాడు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
బస్సు బయల్దేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. బస్సును ఓవర్ స్పీడ్ తో నడిపారని పోలీసులకు సమాచారం అందించారు. స్పీడ్ గా వెళ్లవద్దని డ్రైవర్ ని కోరారట ప్రయాణికులు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం బస్సు క్లీనర్ పరారయ్యాడు. బస్సు క్లీనర్ ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు చీరాలకు చెందినదిగా గుర్తించారు.