మోదీకి రాహుల్, జగన్ బర్త్‌డే విషెస్

-

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా బిజెపి నేతలు, ఇతర సెలబ్రిటీలు మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Birthday wishes from Rahul and Jagan to Modi
Birthday wishes from Rahul and Jagan to Modi

ఇక అటు విజయవాడలోని బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్టును మేం ఖండించాం.. మేం అరెస్టుకు వ్యతిరేకం అనే కదా అర్ధం అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో పొత్తుపై ఆయన కేంద్రంతో మాట్లాడతారని… మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం పై పవన్ తన అభిప్రాయం చెప్పారని వివరించారు. పొత్తులపై మేం మా అధినేత నిర్ణయాన్ని బట్టి చేస్తామన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. హస్తకళల అభివృద్ధి లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అందించడం ఈ స్కిం ఉద్దేశమని.. బిజెపి పేదల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు చేస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news