గడిచిన ఐదేళ్ళల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ , నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ అయిన జగన్ పాలనలో అవినీతి చేశారు అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారు. 1.80లక్షలు ఒక్కో ఇంటికి కేంద్రం ఇవ్వడంతో పాటు, బ్యాంకులో రుణ సదుపాయం కూడా కల్పించింది. పబ్లిసిటీ పిచ్చి పీక్ లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పధకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారు. భూమి హక్కు దారులను కూడా కాదని తన సొంత భూముల్లాగా పట్టాదారుపాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటో వేయించుకున్నారు.
దేశం మొత్తం అమలవుతున్న కేంద్రం పధకానికి కూడా తన పేరు, స్టిక్కర్ మార్చుకున్నారు. జగన్ అబద్దాలు తెలుసుకున్న కేంద్రం నాలుగు వేల కోట్లు రూపాయలు నిలిపేసింది. పేదల బతుకు పై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్. గత ఐదేళ్లల్లో జరిగిన అక్రమాలు, అవినీతి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచేశారు. . ఇప్పుడు జగన్ చెబుతున్న నీతి సూత్రాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశ్నించిన వారి పై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. ఇప్పుడు మానవత్వ విలువలు అంటూ జగన్ మాట్లాడుతున్నారు అని యామినీ శర్మ పేర్కొన్నారు.