ఏపీ గవర్నర్ హరిచందన్‌ను కన్నా నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం కలిసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళలపై అత్యాచారాలు.. హత్యలు, హిందూ దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై గవర్నరకు బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు. నెల్లూరు హనుమాన్ శోభ యాత్రలో జరిగిన దాడిపై చర్యలు తీసుకోకపోవడాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ నేతల బృందం తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని.. హిందువులపై దాడులు జరిగితే ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మతమార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి… హిందువులపై దాడులు పెరిగాయని ఫైర్ అయ్యారు.
ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని.. నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారని నిప్పులు చెరిగారు. ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు కడుతున్నారని అడిగితే బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడి చేశారని.. తెనాలిలో హిందూ మహిళని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అగ్రహించారు. శ్రీశైలంలో అన్యమత మతస్తులే అత్యధికంగా దుకాణాలు కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని.. కాకినాడ జేఎన్టీయూలో అక్రమ నిర్మాణాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.