వాసిరెడ్డి పద్మను ఓసేయ్ అని మేమూ పిలవలేమనుకుంటోందా..? : బోండా ఉమ

-

వాసిరెడ్డి పద్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. దేశం మొత్తం నివ్వెరపోయిన ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని.. ప్రభుత్వాసుపత్రిలో భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వ చర్యలు శూన్యం అన్నారు బోండా ఉమా. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ బజారు మనిషిలా మాట్లాడుతోన్నారు.. అరేయ్ ఉరేయ్ అని మాట్లాడుతున్న వాసిరెడ్డి పద్మను ఓసేయ్ అని మేమూ పిలవలేమనుకుంటోందా..? అని నిలదీశారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల్ని రోడ్డుకు లాగింది వాసిరెడ్డి పద్మే అని.. సంఘటన జరిగిన 3 రోజుల వరకు ఇంట్లో మేకప్ వేసుకుని తిరిగిందా..? అని నిలదీశారు. చంద్రబాబు ఆసుపత్రికి వస్తున్నారని కొత్త మేకప్ తో వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చింది.. మాకు డెడ్ లైన్ పెట్టిన 27వ తేదీలోగా బాధితురాలికి సరైన న్యాయం చేయకుంటే బాధితురాలి పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వాంబే కాలనీలో ఖాళీగా ఉన్న ఇల్లు బాధితురాలికి ఇవ్వాలని.. వ్యక్తిగత కక్ష కోసం ఈ నెల 27న హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు మేము వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే మా పోరాటం

Read more RELATED
Recommended to you

Latest news