పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..!

-

మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో ఎవరు దోషులో‌ఇంకా తేలలేదు. మా‌ ఉద్యోగులు మాత్రం భయ పడి పోతున్నారు అని ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు… విచారణ పూర్తి అయ్యాక వాస్తవాలు చెప్పాలి. పురాతన శాఖ రెవిన్యూ శాఖ లో అనేక రికార్డులు ఉన్నాయి.. ఆ రికార్డు లు భద్ర పరిచే వ్యవస్థ నేడు ఉందా.. పాత భవనాలు, భద్రత లేని పరిస్థితి లో రికార్డు లు భద్రంగా ఉంటాయా.. అనేక రెవిన్యూ కార్యాలయాలు శిధిలావస్థలో ఉన్నాయి. ఈ రికార్డు ల భద్రత కు రికార్డు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి అని అన్నారు.

ఈ విషయం గురించి పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అసలు రెవిన్యూ కార్యాలయాలు కు ఒక వాచ్ మెన్ కూడా లేరు. వందలాది రికార్డు లు ఉండే కార్యాలయాలకు భద్రత అవసరం‌ లేదా.. సీసీ కెమెరాలు పెట్టాలని‌ ఆదేశాలు ఇచ్చారు.. నిధులు ఇవ్వలేదు. ఉద్యోగులు చేసే పనికి, కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయి. నెలకు 54 రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలి అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news