పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా? – బొత్స కౌంటర్

-

నిన్న తాడెపల్లి గూడెంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్ కు తెలుసా? పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా?? అది తగునా? అని ఫైర్‌ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ కు దేశంలోనే అద్భుతమైన వ్యవస్థ గా గుర్తింపు పొందిందని.. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితో ఆరోపణలు అంటూ వ్యాఖ్యానించారు.

మేం చేసిన ఆరోపణలకు, సెలబ్రిటీ చేస్తున్న ఆరోపణలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని.. అప్పుడు నేనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. టీడీపీ సర్వే పేరుతో సమాచారం తీసుకుని ఓటర్ల లిస్ట్ లో పేర్లు తొలగించారని తెలిపారు. పవణ్ కళ్యాణ్, ఆయన పాట్నర్ మాత్రమే హైదరాాద్‌ లో ఉంటారని… ప్రజల డేటాను హైదరాబాద్ ఉంచటం ఏంటి ? అని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని.. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు బొత్స.

Read more RELATED
Recommended to you

Latest news