8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ, వైసీపీ నేత మధ్య మాటల యుద్ధం.. టీడీపీ నేతల సస్పెండ్ వంటి సంఘటనలు రెండు రోజుల చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడంతో ఆ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇవాళ బాలయ్య కూడా అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రస్తావించారు.

టీడీపీ ఎమ్మెల్యేల తీరు సరికాదని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇదిలావుండగా, శాసన మండలిలో బొత్స సత్యనారాణయ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాణయ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ, మెరుగైన విద్యాను రాష్ట్రంలో అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అరెస్టు పై టీడీపీ సభ్యులు ప్రవర్తనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు అంతరాయం కలిగించడం తగదనీ, చంద్రబాబు అరెస్టుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు