అంగన్వాడీలకు జూలైలో వేతనాల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. కార్యకర్తలు, ఆయాలకు జూలైలో వేతనాలు పెంచేందుకు సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారన్నారు.
‘అంగన్వాడి సంఘ ప్రతినిధులు ప్రతిపాదించిన 11 డిమాండ్లలో పదింటిని పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 11వ డిమాండ్ అయిన వేతనాల పెంపునకు కూడా సీఎం ఓకే చెప్పారు. కాబట్టి అంగన్వాడీలు సమ్మె విరమించాలని కోరుతున్నా’ అని అన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
కాగా ఇటీవలే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబరు 2 జారీ చేసింఇఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కోంటూ ఉత్తర్వులు ఇష్యూ చేసింది.