అంగన్వాడీల వేతనాలు పెంచలేమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అంగన్వాడీలు సమ్మెను విరమించాలని కోరామని.. అంగన్వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు…అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదన్నారు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు..? సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదని తెలిపారు.
అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందని..వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించామని వివరించారు. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించామని..గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించామన్నారు. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.