కరోనా కేసులపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు చేశారు.తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సమీక్షలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ సమీక్షలో మంత్రి C. దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ, వారికి సరైన మందులు అందిస్తూ, బాలింత, శిశు మరణాలను తగ్గించేందుకు వారు చేస్తున్న కృషిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ను ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో సహజంగా డెలివరీ లు జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. చైల్డ్ హెల్త్ లో భాగంగా టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.