గుడ్ల వల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలి అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుంది. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో వాస్తవాలు ను ప్రభుత్వం బయటపెట్టాలి. ఎవడు వేధవైతే వాడిని శిక్షించాలని అడుగుతున్నాం. రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు ఉండాలి అని తెలిపారు.
మిడ్ డే మీల్స్ లోపాలపై ఒక్క సమీక్ష అయిన జరిగిందా. జూన్ 12న ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. విద్యార్థులు, వాళ్లకు పంపిణీ చేసే ఆహారం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయి. దీనికి గత ప్రభుత్వానిదే బాధ్యత అని తప్పించుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క ఘటనలో కఠినమైన చర్యలు తీసుకుని వుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఇన్ని జరుగుతుంటే విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం ఏం చేస్తోంది.. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవోద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.