విద్యాశాఖలో దాదాపు 10 వేల ఖాళీలు త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయుల బదిలీల అంశం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.. కర్ణాటక తరహాలో ఏటా షెడ్యూల్ ప్రకారం బదిలీలు చేపట్టాలని అనుకుంటున్నామని వెల్లడించారు.
దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నామని.. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఏడాది మెగా డీఎస్సీ ఉంటుందని వివరించారు. ఎవరూ ఊహించని స్థాయిలో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నామని.. పాఠశాల విద్యాశాఖలో ఇప్పటి వరకు దాదాపు 10 వేల ఖాళీలు గుర్తించామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కాంట్రాక్టు లెక్చరర్లను కూడా చట్ట ప్రకారం క్రమబద్దీకరిస్తామని ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.