అద్భుతమైన పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్.. మీ పెట్టుబడికి అధిక వడ్డీని పొందోచ్చు..

-

పోస్టాఫీసు పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తక్కువ పెట్టుబడితో ఎటువంటి రిస్క్ లేకుండా అధిక లాభాలను పొందేలా ఎన్నో పథకాలు ఉన్నాయి.. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఒకటి నుంచి వడ్డీలను పెంచిన విషయం తెలిసిందే..చాలా మంది ప్రజల దృష్టి 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వైపు మళ్లింది. ఇది సురక్షితమైనది, హామీ కూడా వంద శాతం ఉంటుంది. ఇంకా చిన్న పెట్టుబడిదారులు ఇష్టపడే అత్యంత సాధారణ ఆదాయ వ్యూహాలలో ఇది ఒకటి.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

డబుల్ ఆదాయాన్ని కోరుకునే వ్యక్తులకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమ ఎంపిక. ఏప్రిల్ 1, 2023 నుండి, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లోన్‌లపై వడ్డీ రేటు సంవత్సరానికి 7 నుంచి 7.5 శాతానికి పెంచారు. మీరు 1, 2, 3 లేదా 5 సంవత్సరాల కాలవ్యవధి కోసం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలలో పెట్టుబడి పెట్టవచ్చు. టైమ్ డిపాజిట్ మెచ్యూరిటీ తర్వాత కూడా పథకాన్ని ఒక సంవత్సరం పాటు కొనసాగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌తో ఖాతా తెరవడానికి కనీసం రూ.1000 డిపాజిట్ చేయాలి..

18 ఏళ్లు పైబడి ఉండాలి. మీరు మైనర్ అయితే, మీరు గార్డియన్ ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. మానసిక వికలాంగులు అయితే, ఆ వ్యక్తి తరపున సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. ముగ్గురు పెద్దలు వరకు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు..7.5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే, వారికి వడ్డీగా రూ.2,69,969 వస్తుంది. పెట్టుబడి మెచ్యూర్ అయినప్పుడు మొత్తం రూ.8,69,969 లభిస్తుంది.. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి.. మీరు పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చెయ్యండి.. మంచి లాభాలను పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news