తిరుమలలో పని చేసే వారు..హిందువులు మాత్రమే ఉండాలి – బీఆర్‌ నాయుడు

-

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుమలలో పని చేసే ప్రతి ఉద్యోగి హిందువై ఉండాలని కోరారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ ఛైర్మన్ పదవి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మేం నీతి, నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నామన్నారు. కొంతమంది మీడియా వాళ్లు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారని వెల్లడించారు.

According to reliable sources, TV5 owner BR Naidu will be announced as the chairman of TTD soon

అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసని… తిరుమల పవిత్రతను పాడుచేయొద్దని కోరారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. కాగా….టిటిడి చైర్మన్‌గా ఎంపికైన బిఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని… అదంతా పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది చంద్రబాబు సర్కార్‌. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది చంద్రబాబు సర్కార్‌. ఈ మేరకు క్లారిటీగా ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది చంద్రబాబు సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version