Health : కంటి చూపు మసకబారతోందా..? ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి

-

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని అవయవాలలో కళ్ళు ప్రధానమైనవి అని అర్థం. అందుకే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే మనుషులందరి జీవితాల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక.. వాళ్ల శరీరంలోని ఒక భాగమైన కళ్ళు తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.

అదే పనిగా స్క్రీన్ చూడటం, రాత్రి వేళలో లైట్ ఆర్పేసి మరీ చీకట్లో మొబైల్ వాడటం.. మొదలగు పనులు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసి చూపును మసకబారుస్తాయి. ఇలాంటప్పుడే అలర్ట్ అవ్వాలి. అయితే ప్రస్తుతం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, కొన్ని ఆహారాలు గురించి తెలుసుకుందాం.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు ఏవి అనగానే టక్కున విటమిన్-ఏ అని అందరూ చెప్పేస్తారు. దానితోపాటు ఇంకా విటమిన్ సి ఈ అలాగే మూలకాలైన జింక్, ఇంకా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మొదలగు వాటి వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆకుకూరలు:

పాలకూర, తోటకూర.. వంటి ఆకుకూరలు తిన్నట్లయితే కంటికి ఆరోగ్యాన్ని అందించే విటమిన్లు శరీరానికి చేరతాయి.

చేపలు:

అలాగే కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్ చేపలలో అధికంగా ఉంటాయి. కళ్ళు పొడిబారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే చేపలను మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

చిక్కుళ్ళు:

చిక్కుళ్ళలో జింక్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా కంటిలోని రెటినాల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. రెటినాల్ బావుంటే కంటి చూపు బాగుంటుంది. కాబట్టి మీ డైట్ లో చిక్కుళ్ళను చేర్చుకోండి.

విటమిన్ సి కలిగిన ఆహారాలు:

సిట్రస్ ఫ్రూట్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఉసిరి నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను డైట్లో చేర్చుకుంటే కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version