ఏపీ కొత్త మంత్రివర్గంలో శాఖల మార్పులు ఉంటాయని రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తారన్న సమాచారం లేదని.. బహుశా ఉంటే ఉండవచ్చు అన్నారు. నాకు అప్పగించిన మున్సిపల్ శాఖ భాధ్యతలు స్వీకరించానని.. మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని వెల్లడించారు.
విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో భాద్యతలు స్వీకరిస్తారు..వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిందని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నారు.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని వెల్లడించారు. ఏపీలో మహిళలు సీఎం జగన్ ను తమ సోదరుడిగా చూస్తున్నారు..మంత్రి పదవి లేకున్నా ప్రజలు వెన్నంటే ఉండటం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. కార్యకర్తల ఆధరాభిమానాలు మరింత భాధ్యతను పెంచాయి.. ఎప్పుడూ వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.