వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్లు సునీత వెల్లడించారు. ఇక త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని స్పష్టం చేశారు పోతుల సునీత. ఇటీవల వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేయడం కార్యకర్తలని అయోమయానికి గురిచేస్తోంది.
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సునీత 2017 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మరో మూడేళ్లు సమయం ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. అయితే 2021 ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీకాలం 2023 మార్చి తో ముగియనుండగా.. మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి సునీతకు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.