కొడాలి నాని 420గాడు…పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడు – బుద్దా వెంకన్న

-

కొడాలి నాని 420 గాడు…పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు బుద్దా వెంకన్న. కొడాలి నానికు పిచ్చి పట్టిందని.. చంద్రబాబు, లోకేషుల వెంట్రుక కూడా పీకలేడని పేర్కొన్నారు. లోకేష్ రాయలసీమలో సింహంలా పాదయాత్ర చేస్తున్నాడు.పిచ్చుకుక్క కొడాలి నాని వైసీపీ కార్యాలయంలో కూర్చుని జగన్ చెప్పినట్టు తిడుతున్నాడని ఆగ్రహించారు.

మీడియా సమావేశం లో ప్రతి సారి జూనియర్ ఎన్టీఆరును బయటకు లాగుతున్నాడని.. ఉమ్మడి జిల్లా లో‌16 స్థానాలు ఉన్నాయి.. మాట్లాడితే మా పై గెలువమంటున్నాడని నిప్పులు చెరిగారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు వారు తేడాగాళ్ళా..? మహనాడులో మా పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు బుద్దా వెంకన్న. బీసీలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. నువ్వు ఎవడ్రా..? బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు.. నీ అంతు చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. బీసీలపై నీ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక రకాలైన కేసులు పెట్టావని..అచ్చెన్నాయుడు పై దారుణమైన కేసులు పెట్టారని ఆగ్రహించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version