జగన్…5 అడుగుల తాచుపాము లాంటోడు అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతల వ్యాఖ్యలపై టిడిపి నేత బుద్దా వెంకన్న స్పందించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని… ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడని మండిపడ్డారు.
మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని తెలిపారు. ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహించారు. ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. ఐదు అడుగుల తాచుపాము జగన్….ఈ తాచుపాముకు తన మన బేధంలేదు.. ఎవరినైనా కాటేస్తాడని హెచ్చరించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. వైయస్, జగన్ లు ఎన్ని విచారణ లు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు.