ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమిదే హవా..!

-

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ తాజాగా కొనసాగుతుంది. ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అద్భుతంగా పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో లోక్సభలో పొత్తుల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి కాస్త నిరాశాజనక పనితీరు కనబరుస్తుంది. పశ్చిమ బెంగాల్ లో  కూడా బీజేపీ పార్టీ తన స్థానంలో  ఓడిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీఎంసీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ, డీఎంకే, ఆప్, జేడీయూ ఒక్కో స్థానంలో ముందంజలో ఉన్నాయి.

అలాగే  హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా, నలాగఢ్ తో పాటు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు, మధ్యప్రదేశ్లోని అవార్వాడ స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే, పశ్చిమ బెంగాల్లోని రాయ్గాంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. పంజాబ్లోని జలంధర్ పశ్చిమ స్థానంలో ఆప్ ఆధిక్యంలో ఉండగా.. బీహార్ లోని రూపాలి స్థానంలో జేడీయూ ముందంజలో ఉంది. ఇక, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. తమిళనాడులోని విక్రవాండి స్థానంలో డీఎంకే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొత్తం 13 స్థానాలకు ఇండియా కూటమి 11, ఎన్డీఏ కూటమి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news