గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. కేయల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు ఆర్య అనే విద్యార్థి. అయితే ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగ్ లో రెండు బుల్లెట్లు గుర్తించారు పోలీసులు. వెంటనే ఆ బుల్లెట్లు స్వాధీనం చేసుకొని విద్యార్థిని గన్నవరం పోలీస్ స్టేషల్ కు తరలించారు.
ఇక ఈ ఘటన పై గన్నవరం సీఐ బి.వి శివ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. కేయల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. తనిఖీల్లో ఆర్య బ్యాగ్ లో రెండు బుల్లెట్లు గుర్తించాం. యువకుడిది హర్యానాలోని పానిపట్టు. అయితే ఇవి తన తండ్రికి అనుమతులు ఉన్న రివాల్వర్ లోని బుల్లెట్లుగా చెబుతున్నాడు ఆర్య. గత జులైలో హర్యానా నుండి వచ్చే సమయంలో తండ్రి బ్యాగ్ తో వచ్చినట్లు చెబుతున్నాడు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గన్నవరం పోలీసులు.