జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుంది అని శ్రీకాకుళం జిల్లా నేతలతో జరిగిన మీటింగ్ లో వైఎస్ జగన్ తెలిపారు. నేను జిల్లాల్లో నిద్ర చేస్తాను. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతాను. ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల పాలనలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం.
మన పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చు. ఇచ్చిన హామీలు అమలు చేయటమే దీనికి కారణం. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అసత్య హామీలు ఇచ్చారు.. మనం లబ్ది చేస్తుంటే వాళ్ళు చేస్తామని అబద్దాలు చెబుతున్నారని మన పార్టీ వాళ్ళు అప్పట్లో చెప్పారు. అతి నిజాయితీ, అతి మంచితనం నాలో ఉన్న సమస్య అని మన పార్టీ వాళ్ళు చెప్పారు. అయితే వాటివల్లే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. పథకాలు ఇవ్వకుండా పథకాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారంట. అన్ని వర్గాలు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.