కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : కొండా సురేఖ

-

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయింది. రోజుకో శాఖ ను పరిశీలిస్తున్న. మహిళలు ఆర్ధికంగా ఎదిగే విధంగా కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం. మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. మొదటి విడుతలలో మహిళ శక్తి క్యాంటిన్ లను ప్రారంభించాం అని కొండా సురేఖ తెలిపారు.

అలాగే ఎంజీఎం ఆసుపత్రిలో నూతన ఓపి కేంద్ర ప్రారంభించాం. ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఫార్మాసీ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎంజీఎం ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ కేంద్రంను ఏర్పాటు చేస్తాం. ఎంజీఎం ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తాం. ఎంజీఎం ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది ముఖ్యమంత్రితో చర్చించాను. త్వరలోనే ఎంజీఎం లో సేవలందించే సిబ్బందిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తాను. ఎంజీఎం ఆస్పత్రిలో వేరే జిల్లాల నుండి వచ్చిన ప్రజలు కూడా వైద్య సేవలు పొందుకుంటున్నారు. నిరుపేద ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని కొండా సురేఖ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news