దాదాపు 60 రోజుల పాటు బస్సు యాత్రలు కొనసాగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే దాదాపు 60 రోజుల పాటు మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని ప్రకటించారు సీఎం జగన్. విజయవాడ సభలో నాలుగు కీలక కార్యక్రమాలు ప్రకటించింది వైసీపీ.. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…బస్సు యాత్ర టీం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులు ఉంటారు…ఎమ్మెల్యేల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు ఉంటాయని.. ఒక్కో నియోజకవర్గంలో పర్యటించిన సామాజిక న్యాయం, చేసిన అభివృద్ధి, తీసుకుని వచ్చిన మార్పులను వివరిస్తారన్నారు. బస్సు పై నుంచే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగాలు ఉంటాయని చెప్పుకొచ్చారు సీఎం జగన్. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని పేర్కొన్నారు.