మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు నమోదు..!

-

మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై కేసు నమోదు అయ్యింది. బందరు తాలుకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటి రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్ ను నిర్మించిన పేర్ని నాని.. సివిల్ సప్లయిస్ కు బఫర్ గోడౌన్ గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్ ను తనిఖీ చేసారు సివిల్ సప్లయిస్ అధికారులు.

అయితే ఈ తనిఖీల్లో స్టాక్ లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు.. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు గుర్తించామని తెలిపారు ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి. పేర్ని నాని సతీమణి జయసుధతోపాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేసారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని.. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు లేఖ రాసారు పేర్ని నాని సతీమణి జయసుధ. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు జయసుధ.

Read more RELATED
Recommended to you

Exit mobile version