శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై కేసు నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదు చేసారు. బ్రేక్ దర్శనం కోసం బెంగుళూరుకు చెందిన శశికుమార్ నుంచి 65 వేలు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లు చేర్చారు పోలీసులు.
ఈ కేసుపై శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జఖియా ఖానం మాట్లాడుతూ…
నాపై వైసీపీ నేతలు కుట్రపన్నారన్నారు. అందులో భాగంగానే నా లెటర్ ని మిస్ యూజ్ చేశారని ఆగ్రహించారు. నా లెటర్ ను డబ్బులకు ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదని వెల్లడించారు. నాకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే తెలిసిందని పేర్కొన్నారు. కొందరు వైసీపీ నేతలు నాపై పని కట్టుకొని ఈ కుట్రలో ఇరికించారని ఆగ్రహించారు.
నాకు చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వచ్చింది..నేను విజయవాడకు బయలుదేరుతున్నానని తెలుసుకొని వైసిపి నేతలు నాపై ఈ కుట్రపన్నారని స్పష్టం చేశారు. నిజాయితీగా ఉండే వారికి వైసీపీలో గౌరవం లేదని… మైనార్టీ మహిళలకు వైసీపీలో గౌరవం లేదని స్పష్టం చేశారు. మా పిఆర్ఓ సెలవులో వెళ్లడంతో ఆ లెటర్ను ఎవరు ఎవరికి ఇచ్చారు నాకు తెలియదన్నారు.