కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, దీనికి ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే కారణమని కేంద్రమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. 2028లోపు తాను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని జేడీఎస్ అధినేత కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తానేమీ జ్యోతిష్యుడిని కాకపోయినా ఈ మాట కచ్చితంగా చెబుతానని తెలిపారు.
ఈసారైనా ఐదేళ్లు సీఎం పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాగా, కుమారస్వామి ఫిబ్రవరి 2006 ఫిబ్రవరి- అక్టోబర్ 2007 , మే 2018- జులై 2019 మధ్య రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. లాస్ట్ టర్మ్‌లొ కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా సీఎం అవ్వగా.. ఆ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయింది. ఫలితంగా బీజేపీ పార్టీ ప్రభుత్వాని ఏర్పాటు చేయగా.. సీఎం యడియూరప్ప తర్వాత బసవరాజు బొమ్మై సీఎంగా కొనసాగారు.