జనసేన ప్రజాకోర్టు కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా ప్రజా కోర్టు నిర్వహిస్తామని.. ప్రజా కోర్టులో సీఎం జగన్‌నే ముందుగా నిలబెడతామన్నారు. అవినీతి, అక్రమాలను బయటపెడితే నగదు ప్రొత్సహకాలు ప్రకటిస్తామని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్.
సరైన వ్యక్తులను ఎన్నుకోకుంటే 2047 నాటికి మన బిడ్డల భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న వాళ్లం అవుతామని పేర్కొన్నారు. కులం, మతం చూసి ఓటేయొద్దు.. మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంటును కాపాడే ప్రయత్నం చేస్తున్నామని.. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పథకాలకంటే ఎక్కువే ఇస్తామన్నారు. వచ్చిన పన్ను రాబడిని సద్వినియోగం చేస్తామని.. మహిళల్లో పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని కోరారు పవన్ కళ్యాణ్.