వైరల్‌ వీడియో: ఏం ఐడియారా బాబు.. వెదురుతో వాష్‌ బేసిన్‌

-

ఇంటర్నెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే. .మరికొన్ని ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. అర్రే ఇలా కూడా చేస్తారా అని మీరు ఆశ్యర్యపోయిన వీడియోలు కూడా ఉండే ఉంటాయి కదా ! అలాంటికోవకు చెందినదే ఈ వీడియో కూడా. వాష్‌ బేసిన్‌ అంటే ఎలా ఉంటుంది..? ఒక పంపు కింద చిన్న బేషిన్‌ ఉంటుంది. కానీ ఇక్కడ వెదురుతో వాషింగ్‌ బేసిన్‌ తయారు చేశారు. వాటెన్‌ ఐడియా సర్జీ అన్నట్లు ఉందీ వీడియో..!

సాధారణంగా మనకు వాష్‌ బేసిన్‌ (Wash Basin) అంటే గుర్తొచ్చేది.. ఒక కుళాయి దాని కింద ఓ తొట్టెలాంటి నిర్మాణం. కానీ, నాగాలాండ్‌ పల్లెల్లో మాత్రం ప్రత్యేక పద్ధతిలో రూపొందించిన వాష్‌ బేసిన్లు ఆకట్టుకుంటున్నాయి. పైగా, వాటిని పర్యావరణహితంగా ‘వెదురు’తో తయారు చేయడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నాగాలాండ్‌ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌ ఇలాంటి ఓ వాష్‌ బేసిన్‌ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. దీంతో ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో ఒక పొడవాటి, బోలుగా ఉండే వెదురు కర్రకు ముందుగా రంధ్రాలు చేసి, దాని గుండా నీటిని పారిస్తున్నారు. ఆ రంధ్రాల వద్ద బిగించిన బిరడాలను తొలగించడం ద్వారా బయటకు వచ్చే నీటితో చేతులు శుభ్రం చేసుకోవచ్చు. అక్కడే చేతులు తుడుచుకునేందుకు ఒక క్లాత్‌, హ్యాండ్‌వాష్‌ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇది 100 శాతం పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదని స్థానికులు అంటున్నారు. వీటికి నీటి సౌకర్యాన్ని.. సమీప కొండల్లోని నదులనుంచి తీసుకోవడం ఇంకా హైలెట్‌. నెటిజన్లు సైతం ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 2.1 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. 11.1k లైక్స్‌ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news