ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన జోరుగా సాగుతోంది. శుక్రవారం మంచి కార్యక్రమం మొదలవగా, 3 రోజుల్లో 41,63,957 కుటుంబాల వివరాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నమోదుచేశారు. 11,085 గ్రామ సచివాలయాల పరిధిలో 30.95 లక్షలు, 3,866 వార్డు సచివాలయాల పరిధిలో 10.68 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు.
ఈ నెల 28 వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఫిబ్రవరి 2 వరకు సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. YSR ఆసరా పథకం నిధుల విడుదల తేదీ ఖరారు అయింది. ఈ నెల 23న అంటే రేపు YSR ఆసరా పథకం నిధుల విడుదల చేస్తారు సీఎం జగన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు సీఎం జగన్. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది. ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది.