అంతర్వేది అగ్ని ప్రమాద ఘటన మీద ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం స్పస్తంగా ఉంది, తప్పు ఎవరు చేసినా వదలబోమని ముందు నుండీ హెచ్చరిస్తూ ఉంది. అయితే అక్కడ పర్యటనకు వెళ్ళిన మంత్రుల మీద దాడి చేయడానికి హిందూ సంఘాల వారు ప్రయత్నించడం.
అదే ఊరిలో ఉన్న చర్చి మీద దాడి జరగడంతో సర్కార్ సీరియస్ అయింది. ఇక ఈరోజు బీజీపీ – జనసేనలు దీక్షకు దిగడంతో మరింత వేడి పెరిగిందని చెప్పచ్చు. దీంతో పాటు ఎపీలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఏపీ సిఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ రేపు జీవో వెలువడే అవకాశం కనిపిస్తోంది.