విశాఖ తీరంలో డ్రగ్స్ గుట్టు రట్టు.. భారీ ఎత్తున మాదకద్రవ్యాలు సీజ్..

-

సాగర తీరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి.. ఆపరేషన్ గరుడ పేరుతో సి పోర్ట్ అధికారులు చేపట్టిన దాడుల్లో 25 వేల కేజీల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. సిబిఐ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించారు.. ఇంటర్పోల్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారంతో సీబీఐ ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు..

విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది.. రాజధానిగా మారుతున్న క్రమంలో అక్రమార్కులు ఈ నగరాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మలుచుకుంటున్నారు.. అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో డ్రగ్స్ ను యదేచ్చగా రవాణా చేస్తున్నారు.. పోలీస్ అధికారులతో పాటు సిబిఐ డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడంతో వేల కేజీల మదకద్రవ్యాలు పోలీసులకు చిక్కుతోంది.. బ్రెజిల్ నుంచి జర్మనీలోని బ్రెజిల్ నుంచి జర్మనీలోని హ్యాబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ తీరంలో ఓ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు ఓ కంటైనర్ వచ్చింది. ఈ కంటైనర్ లో వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్పోల్ అధికారులకు పక్కా సమాచారం అందింది..

ఢిల్లి సీబీఐ బృందం, విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను ఇంటర్పోల్ అప్రమత్తం చేసింది. దీంతో ఆ కంటైనర్‌‌ లో తనిఖీలు చేపట్టగా.. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి సుమారు వెయ్యి బ్యాగుల్లో ముఠా డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లుగా గుర్తించి కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ప్యాక్ చేసి ఉంచినట్లుగా పోలీస్ అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది.. ఈ కంటైనర్ను ఎవరు ఆర్డర్ పెట్టారు అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి..

విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు.. ఆ అడ్రస్ ఆధారంగానే కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది… అయితే విశాఖ రాజధానిగా ఉన్న క్రమంలో దాని బ్రాండ్ ఇమేజ్ ని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని ప్రభుత్వం దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిందంటూ వారు వెల్లడిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news