BREAKING : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నారు. కేజీవాల్ను ఈడీ ఆఫీస్కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .

సీఎంని ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో కేజీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news