ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మ‌రిన్ని అప్పులు చేసేందుకు అనుమ‌తి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని అప్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన కార‌ణంగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రాష్ట్రాల్లో విద్య‌త్ సంస్క‌ర‌ణ‌లు చేయ‌డానికి అంగీక‌రించిన రాష్ట్రాల‌కు మ‌రిన్నీ అప్పులు చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు జారీ చేసింది. ఆంధ్ర ప్ర‌దేశ్ తో స‌హా.. మొత్తం 10 రాష్ట్రాల‌కు అప్పులు చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ర్మిషన్ ఇచ్చింది.

ఆయా రాష్ట్రాల్లో బోర్లుకు, వ్యవ‌సాయ బావుల‌కు మీట‌ర్లు బిగించినంద‌కు అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచినంద‌కు కానుక‌గా.. అప్పులు తీసుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమ‌తితో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో రూ. 3,716 కోట్లు అద‌నంగా అప్పులు చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఇప్ప‌టికే అప్పుల భారంతో ఉంది. ఇలాంటి స‌మ‌యాల్లో మ‌రిన్ని అప్పులు అంటే.. ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news