తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ప్రకటించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని సిద్దిపేట్ జిల్లాలో జరిగిన దర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దే దించి తీరుతామని అన్నారు.
పీఎం మోడీ రైతుల గోడు వినాలని అన్నారు. మన్ కీ బాత్ కాదు.. రైతుల సమస్యలు వినాలని హరీష్ రావు అన్నారు. మోదీ హయంలో.. అచ్చే దిన్ రాలేదని.. సచ్చే దిన్ వచ్చిందని విమర్శించారు. ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప తిరిగి ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి తెలియదని అన్నారు. దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అన్నారు. అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఇంటిపై నల్ల జెండా లు ఎగరవేసి.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుదామని పిలుపునిచ్చారు.