మచిలీపట్నంలో కేంద్రబృందం పర్యటన.. వరద నష్టంపై ఆరా!

-

ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన విషయం తెలిసిందే. దీంతో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర బృందం అధికారులు మచిలీపట్నం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని ఏపీ అధికారులు తెలిపారు. తొలుత తాడేపల్లిలోని ఏపీ ఎస్డీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మధ్యాహ్నం ఒంటి గంటకు బృందం సభ్యులు పరిశీలిస్తారు.

అనంతరం పెనమలూరు మండలం యనమల కుదురులో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలను 2.30 గంటలకు సందర్శిస్తారు.పెదపులిపాకలో నష్టపోయిన ఇళ్లు,ఉద్యానవన పంటలను పరిశీలించిన అనంతరం చోడవరం, కంకిపాడు, మద్దూరులో దెబ్బతిన్న పంటలు పరిశీలించనున్నారు. ఆ తర్వాత వరదలతో కొట్టుకుపోయిన రొయ్యూరు-కంకిపాడు రోడ్డును పరిశీలిస్తారు.చివరగా పామర్రు, గుడివాడ, నదివాడ మండలాల్లోని ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత విజయవాడకు బయల్దేరి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version