స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1గా చంద్రబాబు…రూ. 241 కోట్ల కుంభకోణం !

-

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 చంద్రబాబు ఉన్నారు.

షెల్ కంపెనీ ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగం చంద్రబాబుపై ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో సీఐడీ, ఈడీ విచారణ చేస్తోంది. ఇక ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. స్కిల్ కేసులో మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ, ఘంటా సుబ్బారావులను గతంలోనే విచారించిన సీఐడీ… ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news