కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరణ తెలిపారు తెలంగాణ అధికారులు. తెలంగాణ – సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ తుక్కుగుడలో నిర్వహించనున్న సభా స్థలం దేవాదాయశాఖకు చెందిన భూమి కావడం వల్ల రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్.

ఇక అటు 17న తుక్కుగూడాలో కాంగ్రెస్ విజయ భేరీ సభ నిర్వహించ బోతున్నట్లు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సభకు విజయ భేరి గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. బీజేపీ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ లో అనుమతి ఇవ్వకుండా చేసిందని… Cwc కి జాతీయ నాయకులు వస్తున్నారన్నారు. భద్రత కల్పించాలని కోరామని చెప్పారు. కానీ Brs .. బీజేపీ తో కుమ్మక్కు అయ్యి… Cwc..సభ ను అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు.