పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ..చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది. ఇప్పుడు చంద్రబాబు ఆడియో..ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.పథకాల్లేవ్ ఏం లేవ్…..మొత్తం అమరావతికి కుమ్మరిస్థామని ఆ ఆడియోలో చంద్రబాబు అన్నారు. మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయ్…త్వరలో మీకు లాభాలు చూపిస్తానంటూ చంద్రబాబు మాట్లాడారు. దీంతో చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది.
అయితే.. దీనిపై చంద్రబాబు స్పందించారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందన్నారు. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదన్నారు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడని ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు.