బాబును భ్రమల్లోనే ఉంచేస్తోన్న సీఎం, సుజానా!

-

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థతి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! దానికి కారణం… నమ్మిన వాళ్ల, నమ్ముకున్న వాళ్లు.. నమ్మిస్తూ మాయపుచ్చుతుండటం జీర్ణంచుకోలేని పరిస్థితికి తెచ్చిపెట్టిందంటున్నారు. దీంతో ఈ పరిస్థితిలో బాబు కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారంట!

వివరాల్లోకి వస్తే… ఎన్నికల ముందు ఏపీలో రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీకి దూరమై కేంద్రంలో చక్రం తిప్పుదామని.. మోడీని అనరాని మాటలు అన్న చంద్రబాబు.. ఓటమి పాలైన తర్వాత తీవ్ర ఆలోచనలు పెట్టుకున్నాడు. ఆ ఆలోచనల్లోంచే తమకంటూ కేంద్ర రాజకీయాల్లో కూడా తన మనుషులు ఉండాలని సుదూర ఆలోచనతో తమ నేతలను బీజేపీలోకి పంపించారు. వారు కూడా ఇదే అవకాశంగా భావించి.. అత్యవసర పరిస్థితిలో క్షణం కూడా ఆగకుండా ఆగమేఘాలపై బీజేపీలో చేరిపోయారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు సుజనా చౌదరి, సీఎం రమేష్!

అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు బాబును భ్రమ పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారు కేవలం తమ పనుల కోసమే తమ దృష్టిని కేంద్రీకరించారని.. వారు ఇరువురు కూడా బాబు కోసం బీజేపీతో ఎలాంటి సత్సంబంధాలను నెరపడం లేదని.. అలాంటి ఆలోచన కూడా చేయడం లేదనేది ఇప్పడు సర్వత్రా వినిపిస్తున్న మాట! ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానుల విషయం, నిమ్మగడ్డ వ్యవహారంలో వారిరువురు కేంద్రంతో ఎలాంటి విషయాలను నెరపడం లేదని.. ఆ విషయం ఈ మధ్యనే బాబుకు తెలిసిందని అంటున్నారు.

అయితే బాబుతో మాత్రం వారు… మేం ఇరువురం ఆ రెండింటి విషయంలో కేంద్రంతో తీవ్రంగా చర్చిస్తున్నాం.. మరేం పర్వాలేదు.. మనకే అనుకూలంగా అన్నీ ఉంటాయి అని భ్రమల్లో ముంచుతున్నారని కూడా పెద్ద ఎత్తున టాక్ ఊపందుకుంది. దీంతోల్.. రాజకీయ నాయకులు.. వ్యాపారస్తులను నమ్ముకొని రాజకీయాలు చేయాలంటే కష్టమే అని బాబు సన్నిహిత మిత్రుల వద్ద వాపోయినట్లు కూడా సమాచారం. మరి ఇప్పుడు ఈ విషయాన్ని బాబు బయటకు చెప్పలేడు.. అలా అని చూస్తూ ఉండనూలేడు.. మొత్తానికి బాబు లోలోన వీరు చేస్తున్న నమ్మక ద్రోహంతో కుమిలిపోతున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version