అంబటి మంత్రి కాదు..బ్రో సినిమాలో ఓ బ్రోకర్‌ – చంద్రబాబు

-

అంబటి మంత్రి కాదు..బ్రో సినిమాలో ఓ బ్రోకర్‌ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఆశాజ్యోతి నందమూరి రామారావు అని. నాకు వయస్సు అయిపోదంటున్నారు. అదీ ఒక్క నెంబర్ మాత్రమే…సింహాం ఎప్పటికీ సింహమే అన్నారు చంద్రబాబు. ఇరిగేషన్ మంత్రి ఎవరో తెలుసా …. అంబోతు రాంబాబు.. బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాడూ…. బ్రో సినిమాలో యాక్టింగ్ చేసిన బ్రోకరా…అంటూ ఫైర్‌ అయ్యారు.

అన్న క్యాంటీన్ లో టిడిపి అన్నం పెడితే ముఖ్యమంత్రి సున్నం పెడుతున్నాడని ఆగ్రహించారు. వ్తె నాట్ పులివెందుల… బిటెక్ రవికి అందరికీ తోడుగా నిలబడ్డాలని కోరారు చంద్రబాబు. సమయం వస్తే కొదమసింహాంలా తిరుగుబడుతానని… పులివెందులలో టిడిపి జెండా ఎగరాలన్నారు. బాబాయిపై గొడ్డలి వేటు వేశారని.. పులివెందల పులిబిడ్డ సునీత న్యాయం కోసం పోరాడుతోందని వెల్లడించారు. కడప ఎంపీ…. కమలాహాసన్ ను మించిపోయాడు… బాబాయిని చంపిన వ్యక్తిని దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news