జగన్ పాలనలో 3372 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. మహాశక్తి ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారభించిన చంద్రబాబు…టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహాశక్తి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 52 వేల 587 దాడులు, అఘాయిత్యాలు జరిగాయన్నారు.
22 వేల 278 మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపారు. 3372 మందిపై అత్యాచారాలు జరిగాయని తెలిపారు. 41 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఆడబిడ్డల సంబంధాల గురించి వలంటీర్లకు ఏం సంబంధం…. చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఆగ్రహించారు. కరెంట్ బిల్లులా? ఇంటి బాడుగా? ఇష్టానుసారం కరెంట్ బిల్లులు పెంచేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని… ఎమ్మెల్యేలు గడప గడపకూ వచ్చే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ఉంటే ఆడబిడ్డల పట్ల కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉండేదని..ఇంట్లో పడుకున్నా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి యాసిడ్ పోస్తారో తెలియదని.. రేపల్లెలో దారుణం జరిగితే దద్దమ్మ సీఎం ఎందుకు వెళ్ళలేదని ఆగ్రహించారు.