బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈ తరుణంలోనే.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు బండారు సత్యనారాయణ మూర్తి. మాడుగుల అభ్యర్థిగా గతంలో పైలా ప్రసాదును ప్రకటించిన తెలుగుదేశం. మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తి పేరు ఫైనల్ చేసింది.
ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. మాడుగుల స్థానం నుంచి నాకు చంద్రబాబు అవకాశం కల్పించారన్నారు. బీఫార్మ్ తీసుకునేందుకు వచ్చానని తెలిపారు. మాడుగులలో అందరినీ కలుపుకుపోతానని ప్రకటించారు బండారు సత్యనారాయణ మూర్తి.