చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. గడువు కోరిన సీఐడీ.. విచారణ వాయిదా..!

-

అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తుబేలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పై ఇవాళ మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయ్యారా అలైన్మెంట్ అవకతవకలు జరగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తుబేలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రారంభం కాగానే సీఐడీ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కోరింది. దీంతో న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 23 కి హైకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత జడ్జిలను దూషించారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది రెండు వారాలకు వాయిదా వేసింది ఇకపోతే స్కిల్స్ క్యాం కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో ఈ కేసులో గత విచారణ సందర్భంగా ఈ నెల 28 వరకు చంద్రబాబుని అరెస్టు చేయబోమని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వెల్లడించిన విషయం తెలిసింది దీంతో కేసు తదుపరి విచారణ జస్టిస్ మల్లికార్జునరావు ఈనెల 21కి వాయిదా వేశారు. అయితే మంగళవారం విచారణ ప్రారంభంలో సిఐడి న్యాయవాదుల పాస్ ఓవర్ అడగడంతో మరోసారి విచారణ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news