నో డౌట్… కుత్బుల్లాపూర్ ఆయనదే

-

  • కమలానికి అనుకూలంగా సర్వేలు
  • కూనా కె జై కొడుతున్న అత్యధిక ఓటర్లు
  • ఈ సీటు బీజేపీ కి రావడం పక్కా

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో భారతీయ జనతా పార్టీ తరపున నిలబడిన కూనా శ్రీశైలం గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.అంతేకాదు ఓటర్లు కూడా ఆయనకే జై కొడుతున్నారు. తాజాగా నిర్వహించిన పల్స్ సర్వేలో ఎక్కువశాతం ఓట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. అధికార బీఆర్ఎస్ ని కాదని ఇక్కడి ఓటర్లు శ్రీశైలం గౌడ్ ని గెలిపించేందుకు సిద్ధమైపోయారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్యే పోరు నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వివేకానంద బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి కొలం హనుమంథరెడ్డి పోటీ చేస్తున్నారు.కొందరు స్వతంత్రులు కూడా బరిలో ఉండగా వారి నుంచి నామమాత్రపు పోటీ మాత్రమే ఎదురవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పల్స్ సర్వే సంస్థ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటర్ల సర్వే జరిపింది. ఇందుకోసం 13,400 శాంపిల్లను సేకరించింది.18-35 ఏళ్లలోపు వారు 6030 మంది తమ అభిప్రాయాలను తెలియజేసారు.36-60 ఏళ్ల లోపు వారు 5360 మంది,61 ఏళ్ల పైబడిన వారు 2010 మంది నుంచి శాంపిల్లను సేకరించగా సింహభాగం అనగా 41 శాతం ఓట్ల షేరు శ్రీశైలం గౌడ్ వైపే ఉన్నారు. 34 శాతం బీఆర్ఎస్,22 శాతం ఓటర్లను కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు వేశారు.ఇక స్వతంతులు 3 శాతం ఓట్లు షేర్ చేసుకుంటున్నారు.

మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న శ్రీశైలం గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 ఫిబ్రవరి 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు..పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.ఇప్పుడు అదే పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news