ఏపీలో ప్రతి పక్ష నాయకుల వరుస అరెస్ట్ ల పరంపర కొనసాగుతోంది. నిన్న మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేయగా.. చంద్రబాబను అరెస్ట్ చేసేందుకు వైసీపీ సర్కార్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. హై కోర్టు వేసవి సెలవుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతోంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులు గతంలోనే తేలిపోయాయి కాబట్టి ఈ సారి కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పు చేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు.
ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేస్తూంటారు. సీఐడీ కేసులు చేస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక కేసులో చంద్రబాబును బొక్కలో వేయడం ఖాయంగా కనిపిస్తోంది.