వాదనలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటా : చంద్రబాబు

వాదనలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటానని సంచలన ప్రకటన చేశాడు చంద్రబాబు నాయుడు. విజయవాడ ఏసిబి న్యాయమూర్తి ముందు చంద్రబాబు స్వయంగా వినిపించిన వాదనలు ముగిసాయి. మీరు కోర్టులోనే ఉంటారా? లేదా? అని న్యాయమూర్తి అడగగా… వాదోపవాదనలు అయ్యేవరకు కోర్టు హాలులోనే ఉంటానని బాబు బదులు ఇచ్చారు. అటు చంద్రబాబు తరపున లూథ్ర వాదనలు వినిపిస్తున్నారు.

కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు అరెస్ట్ టిడిపి అధినేత చంద్రబాబు A-1గా ఉన్నారని తోలుత వార్తలు వచ్చాయి. అయితే సిఐడి అధికారులు తాజాగా విజయవాడ ACB కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో A-37గా చంద్రబాబుని పేర్కొనగా…A-1గా గంట సుబ్బారావు పేరును చేర్చారు. నిధుల మళ్లింపుపై ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సిఐడి పేర్కొంది.