ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇకనుంచి నెలకు రూ. 4,000 పెన్షన్ అందుతుందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా అనేకమంది లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఇదిలా ఉండగా…. మరోవైపు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు.